రాష్ట్రంలో ఎన్నడు లేని పరిస్థితులను చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని పరిస్థితులను రాష్ట్రంలో చూస్తున్నామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహన్ అన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని రైతులనూ ఆదుకోలేదని విమర్శించారు. త్వరలోనే పులివెందులలో రైతు భరోసా యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. పులివెందులలో చనిపోయిన 135 మంది రైతుల కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు. డీజీపీని కలిసేందుకు జనసేన అధినేత పవన్ ప్రయత్నించినా అనుమతి ఇవ్వడం లేదన్నారు.













