ఫెమినా మిస్ ఇండియా సౌత్ విజేత ఇందు ఫల్గుణి
ఫ్యాషన్ రంగంలో ఎంత ఎదిగినా తాను చదువుకే తొలి ప్రాధాన్యం ఇస్తానని ఫెమినా మిస్ ఇండియా (Femina Miss India) సౌత్ 2026 విజేత చిలకలపూడి ఇందు ఫల్గుణి (Indu Phalguni) తెలిపారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయశాస్త్రంలో కోర్సు చేస్తున్నానని, భవిష్యత్తులో న్యాయమూర్తి (Judge) కావాలన్నదే తన లక్ష్యమన్నారు. తన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరుకు చెందినవారని, వతిరీత్యా హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ లో ఉంటున్నట్లు తెలిపారు. తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగినా, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి అవకాశం లభించిందన్నారు. ఇంట్లో తాత, నాన్న లా చదవడం, వారి వత్తిరీత్యా తనకూ ఆసక్తి పెరిగి న్యాయశాస్త్రంలో కోర్సు చేస్తున్నట్లు వివరించారు. ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలన్న ఆలోచన గతంలో లేదని, ఏడాది కింద అవకాశం రావడం తల్లిదండ్రులూ నా ఇష్టానికే వదిలిపెట్టడంతో ఈ రంగంలో అడుగుపెట్టినట్లు తెలిపారు. గత జనవరిలో ముంబయి కేంద్రంగా ఆడిషన్స్ జరగగా, ఫెమినా మిస్ ఇండియా పోటీలు భువనేశ్వర్ (Bhubaneswar) లో జరిగినట్లు తెలిపారు. ఏపీ తరపున ఫెమినా మిస్ ఇండియా సౌత్ గా గెలుపొందటం ఇదే తొలిసారని, తానే కాకుండా అమ్మానాన్నలు, సోదరుడు వేదికపైకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








