AP: దేశంలోనే ఇటువంటి మోసం.. ఎక్కడా జరిగి ఉండదు
గత ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ (ycp) నేతలు ఎన్నో అక్రమాలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే ఆదివారెడ్డి వాసు (Adireddy vasu) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భారత్ (margani bharat) చేసిన అక్రమాలు బయటకి వస్తున్నాయని చెప్పారు. గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్‌కు చెందిన భూమిని అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. 11 సంవత్సరాల లీజు అగ్రిమెంట్‌ను 33 సంవత్సరాల సబ్ లీజుకు మార్చారన్నారు. దేశంలోనే ఇటువంటి మోసం ఎక్కడా జరిగి ఉండదని మండిపడ్డారు. కార్యవర్గాన్ని సైతం రద్దు చేసి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ నాయకులను కూడా ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. నగరం నడిబొడ్డున రూ.5 కోట్ల విలువైన ఆస్తిని కొట్టేయాలని చూశారని చెప్పారు. కూటమిలోని నాయకులు ప్రజలతో మమేకం అవుతున్నారని వివరించారు. జగన్ (Jagan) అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు.













