టీటీడీ భక్తులకు తీపి కబురు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని గత 60 రోజులుగా కల్పించకపోవడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. దర్శనాలు ఎప్పుడు పున ప్రారంభిస్తామో ఇప్పట్లో చెప్పలేమన్నారు. అయితే భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందని చెప్పారు. లడ్డూ ఒకటి రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు చేపట్టనున్నట్లు సృష్టం చేశారు. ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేయనున్నామని, పెద్దమొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్ చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ 98495 75952, ఆలయ పేష్కార్ శ్రీనివాస్ 97010 92777ను సంప్రదించవచ్చని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.













