టీడీపీ షాక్.. జ్యోతుల రాజీనామా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్చే జ్యోతుల నెహ్రూ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ ఇన్చార్జిగా మాత్రం కొనసాగుతానని చెప్పారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ ప్రకటించడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. జ్యోతుల నెహ్రూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించిన ఆయన 2014లో వైకాపా నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత నెహ్రూ టీడీపీలో చేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని కార్యకర్తల సమావేశంలో భావోద్వేగంతో ప్రకటించారు.













