రూ.10 కోట్లు విరాళమిచ్చిన జనసేనాని పవన్
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, మన కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిధికి తన వంతుగా పవన్ రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు. వ్యక్తిగత గెలుపు కోసం కాదు, సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పించే బాధ్యత తమదేనని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు.













