అభ్యర్థుల జాబితాకు మళ్ళీ అదే సెంటిమెంట్ సెట్ చేస్తున్న జగన్..
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ జాబితాను విడుదల చేయడానికి సిద్ధపడుతోంది అధికార పార్టీ. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఇప్పటికే తమ పార్టీకి సంబంధించిన 94 మంది అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ పార్టీ కూడా ఈనెల 16వ తారీఖున ఇడుపులపాయలో జరగనున్న వైఎస్సార్ ఘాట్ వేదిక నుంచి అసెంబ్లీ మరియు లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఉద్దేశంలో ఉందని టాక్. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇడుపులపాయ నుంచే జగన్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి ఎన్నికల్లో విక్టరీ వరించింది. దీంతో జగన్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు విడతల వారీగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కూడా మార్పులు చేర్పులు మొత్తం చేసి 77 అసెంబ్లీ స్థానాలకు ,23 లోక్ సభ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. ఇక ఇడుపులపాయలో ఫైనల్ జాబితా ప్రకటన అనంతరం జగన్ పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నట్లు టాక్.













