మత్స్యశాఖ నిధులు మళ్లించింది ఆయనే : పల్లా శ్రీనివాసరావు
జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) అన్నారు. విశాఖ (Visakha)లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ నిధులను దారి మళ్లించి మత్స్యకారులకు అన్యాయం చేసిన జగన్, ఏం ముఖం పెట్టుకుని ఇప్పుడు పరామర్శించేందుకు వచ్చారని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72 గంటల్లోనే గల్లంతైన మత్స్యకారుల (Fishermens) కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారాన్ని అందించాం. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 116 మందికి నష్ట పరిహారం ఇవ్వకుండా వారి కుటుంబాలు మానసికంగా కుంగిపోయేలా చేశారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ.3.15 కోట్లు చెల్లించాం అని తెలిపారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు.








