అధికార లాంఛనాలతో ముద్రగడ్డ అంత్యక్రియలు : సీఎం చంద్రబాబు
కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) (73) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్సభ (Lok Sabha) సభ్యుడిగా, కేబినెట్ మంత్రి (Cabinet Minister)గా ముద్రగడ పద్మనాభం సేవలదించారని, అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.








