ఏపీలో సర్ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా (Voter List) ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (Election Commission of India) (ఈసీఐ) సవరించింది. సర్ గడువును ఈనెల 24 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2026 జులై 1ను అర్హత తేదీగా నిర్ణయించి సవరణ ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
జూన్ 15 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇదే గడువులో పోలింగ్ (Polling) కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. అనంతరం జులై (July) 31న ఓటర్ల ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్) ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28లోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది.








