ఫ్యూచర్‌సిటీలో రూ.60 వేల కోట్లతో .. అమెజాన్ డేటా సెంటర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) లో దిగ్గజ సంస్థ అమెజాన్ కొత్త డేటా సెంటర్ (Amazon Data Center) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పన్నెండేళ్ల వ్యవధిలో సంస్థ విస్తరణకు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరస్పర అంగీకారం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాల మేరకు భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ విస్తరణ కోసం 202 ఎకరాలు, చందన్వెల్లి (Chandanvelli)లో 99 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రూ.125 కోట్ల విలువ చేసే ప్రోత్సాహకాలు, రాయితీలు అమెజాన్‌కు అందించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో మైలురాయిగా నిలవనుంది. కొత్తగా విస్తరించనున్న ఈ అమెజాన్ డేటా సెంటర్ పనులకు ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.








