వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధం..?
రాజమహేంద్రవరం కోర్టు పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును(Ananth babu) పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై రాజమహేంద్రవరం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ నిమిత్తం అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కోర్టుకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
అయితే, ఆయన కోర్టు లోపల ఉన్న సమయంలోనే బయట భారీగా పోలీసులు మోహరించడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ప్రాంగణం వద్ద ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించడంతో, విచారణ ముగిసిన వెంటనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతబాబును అరెస్టు చేయడానికి ప్రధాన కారణం ఈ నెల 20న కాకినాడలోని(Kakinada) సర్పవరం పోలీసు స్టేషన్లో నమోదైన కొత్త కేసు అని సమాచారం. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను భయభ్రాంతులకు గురిచేయడం, వారిని ప్రలోభాలకు గురిచేసి సాక్ష్యం చెప్పకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
బెయిల్ నిబంధనలను అతిక్రమించి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆధారాలతో పోలీసులు ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి, ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో అనంతబాబు గతంలో జైలుకు వెళ్లారు. సుదీర్ఘ కాలం రిమాండ్‌లో ఉన్న ఆయనకు గతంలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇప్పుడు సాక్షులపై ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి








