సీఎం జగన్ విశాఖ ఎందుకొస్తున్నారు?.. దేనీ కోసం వస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఎందుకొస్తున్నారు? దేని కోసం వస్తున్నారు? అని తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అడ్డదారిలో విశాఖ రావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీవారు. రాజధాని ప్రకటనతో విశాఖ అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు. పులివెందుల పంచాయితీలు విశాఖలో నడుస్తున్నాయి. రాజకీయ లబ్ధి తప్పా, విశాఖ ప్రజల వేదన మీకు పట్టడం లేదు. 3 నెలల ముచ్చట కోసం ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. విశాఖ రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టండి. 99 శాతం ప్రజలు రాజధానిగా విశాఖ వద్దనే చెబుతారు అని అన్నారు.













