ఈ నెల 25న విజయవాడ నుంచి సింగపూర్ కు విమానం
విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవ్వడానికి ముహూర్తం ఖరారైంది. ఇందులో భాగంగా ఈ నెల 25న గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను తొలుత నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఇండిగో సంస్థ తేదీని ఖరారు చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విమానాశ్రయం అధికారులకు సైతం సిద్ధంగా ఉండాలంటూ సమాచారం అందించారు. కస్టమ్స్ సిబ్బంది జీతాలను ఎవరు చెల్లించాలనే నిబంధనల విషయంలో ఆ విభాగం నుంచి ఒకటి రెండు రోజుల్లో అనుమతి రానుందని అధికారులు భావిస్తున్నారు. అనుమతి వచ్చిన వెంటనే టిక్కెట్ల విక్రయాన్ని ఇండిగో సంస్థ ప్రారంభిస్తుంది. 25 నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది.













