అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయం : సీఐడీ
మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని ఆయన తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చినందున బెయిల్ గడువు ముగిసే వరకు అరెస్టు చేయబోమని తెలిపారు. ఈ మేరకు హైకోర్టు ఏజీ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 21కి వాయిదా వేసింది.













