500 మంది ప్రవాసాంధ్రులకు ఉచిత బీమా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకొని కువైట్ రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికిపైగా ప్రవాసాంధ్ర భరోసా బీమా చేయించినట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాయని మహేష్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ముమ్మడి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ప్రవాసీ భారతీయ దివాస్‌ను పురస్కరించుకొని వివిధ కంపెనీల్లో పనిచేసే వాళ్లు, ఇంట్లో పనిచేసేవాళ్లు, డ్రైవర్లు, తక్కువ జీతం ఉన్నవారిని గుర్తించి బీమా చేయించామన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కరానికి ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యులు కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రవాసాంధ్ర భరోసా బీమా ఈ నెల 15న న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ పూర్తి అవుతున్నందున కొత్త అగ్రిమెంట్లో ప్రీమియం రూ.550 కన్నా ఎక్కువ గాను, ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున ప్రవాసాంధ్రులకు ప్రోత్సాహకరంగా రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం రూ.550 నుంచి రూ.275లకు తగ్గించిందన్నారు. 14వ తేదీ రకు కువైట్ల్లోని హవళ్లిలో ఉన్న ఆర్ఆర్ స్పైసీ హోటల్ వద్ద ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఉచితంగా బీమా నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ అద్యక్షుడు మేడపాటి వెంకట్, డైరెక్టర్ ఇలియాస్, ఉచితంగా బీమా నమోదు కార్యక్రమానికి సహకరించిన కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, రెడ్డీస్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.













