Justice N.V. Ramana: తెలుగు భాషలో పునాది ఉంటేనే .. ఇంగ్లీష్‌లో పట్టు : జస్టిస్ ఎన్.వి.రమణ
ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగాల వైపే కాకుండా నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ (Justice N.V. Ramana) సూచించారు. గుంటూరు లోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే (Graduation Day )కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు భాషలో గట్టి పునాది ఉంటేనే ఇంగ్లీష్‌లో పట్టు సాధిస్తారని తెలిపారు. భారత్ (India) పై అమెరికా విధించిన సుంకాల వంటివి ప్రస్తావిస్తూ ఇలాంటి అటుపోట్లను తట్టుకోవాలంటే కొత్త ఆవిష్కరణల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధి బాట పట్టించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ని ఆధునిక సాంకేతికతకు హబ్‌గా మార్చేలా ప్రభుత్వం పని చేస్తోందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి (Madhumurthy) అన్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.







