America : అమెరికాలో శ్రీకాళహస్తి యువకుడిపై కాల్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గోవిందవరానికి చెందిన యువకుడు పోతుగుంట మోహన్సాయి (Mohan Sai) (25)పై అమెరికా (America) లోని మెస్పిస్ టెనస్సీలో కాల్పులు జరిగాయి. గోవిందవరం గ్రామానికి చెందిన మురళి(, Murali), అరుణ (Aruna ) కొన్నేళ్ల కిందట శ్రీకాళహస్తి పట్టణానికి వెళ్లి స్థిరపడ్డారు. రెండేళ్ల కిందట వారి కుమారుడు మోహన్సాయి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలోని మెస్పిస్ టెనస్సీ(Mespis Tennessee) ప్రాంతంలో స్నేహితుడి కారులో ఉండగా, గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మోహన్సాయి కుటుంబీకులు తీవ్ర కలత చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మోహన్సాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.













