తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే : దస్తగిరి
ఐదేళ్ల పాటు జగన్, భారతి, అవినాష్ రెడ్డి తనను ఇబ్బంది పెట్టారని మాజీమంత్రి వివేకా హత్య కేసు అఫ్రూవర్ దస్తగిరి ఆరోపించారు. ఈ మేరకు కడపలో జిల్లా ఎస్పీ హర్షవర్దన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి నన్ను ఇబ్బందులకు గురి చేశారు. వైసీపీ హయాంలో పోలీసులు కట్టు బానిసలుగా పనిచేశారు. జైల్లో అధికారులు నన్ను హింసించారు. వైసీపీ నేతలకు కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ తొత్తుగా మారారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. వివేకా హత్య కేసులో రాజీ కావాలని డబ్బు ఆశ చూపారు. చైతన్యరెడ్డి మాట వినకపోవడంతో జైల్లో నన్ను హింసించారు. నేను జైల్లో ఉన్న సమయంలో సీసీ పుటేజీని తొలగించారు. నాటి ఘటనలపై విచారణ చేయాలని ఎస్పీ, సీబీఐని కోరుతున్నా. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని అన్నారు.













