కరోనాపై వాట్సప్ సమాచారం: ఏపీ ప్రభుత్వం
ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఉంటే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోన్నప్పటికీ గడిచిన 10 రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అటు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ పేషెంట్లకు అరగంటలో బెడ్ కేటాయించాలని చెప్పడమే కాకుండా.. ఎవరైనా నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇప్పటికే పలు జిల్లాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఊహించనంత వేగంగా లక్షల సంఖ్యకు కేసులు చేరుకోవడం వారిని తీవ్ర గందరగోళంలో పడేస్తోంది.
ఈ నేపధ్యంలో కరోనాపై అవగాహన పెంచడంతో పాటు ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని కోసం ప్రత్యేకంగా పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది. అటు కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు
శ్రీకాకుళం – 7995225220, విజయనగరం – 9491012012, విశాఖపట్టణం – 9000782783, తూర్పు గోదావరి – 9849903862, పశ్చిమ గోదావరి 9966553424, కృష్ణ – 9100997444, గుంటూరు – 9121008008, ప్రకాశం – 9063455577, నెల్లూరు – 9704501001, చిత్తూరు – 9491077099, అనంతపురం – 9493188891, కడప – 9849900960, కర్నూలు – 9849902412.
నోడల్ అధికారుల నెంబర్లు ఇవే..
AMC, విశాఖపట్నం – 92466 16864 SMC, విజయవాడ – 98484 36653 SVIMS, తిరుపతి – 94935 47709 GMC, అనంతపురం – 98494 99761 GMC (RIMS), కడప – 92478 99544













