రెండెడ్ల బండి నడిపిన చంద్రబాబు
అనంతపురం జిల్లా ఊడేగోళెంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా రెండెడ్ల బండిని నడిపారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ శాఖల ఎగ్జిబిషన్ సందర్శించారు. అప్పాజీ రైతు పొలంలో బిందు సేద్యం, కుమార్ రైతు పొలంలో పంటసంజీవని పరిశీలించి గంగపూజ చేసి, సభస్థలి వద్ద వ్యవసాయ అనుబందశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్ర చంద్రబాబు పరిశీలించారు. టి. హనుమంతప్ప రైతు మెట్ట భూమిలో వరుణ పూజా చేశారు. కోలాటాలు, ఆట పాటల మధ్య కోలాహలం గా చౌడప్ప రైతు పొలంలో చంద్రబాబు నాగలి పట్టి చేను దున్నారు. గొర్రు తో వేరుశెనగ విత్తు విత్తారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, విప్ యామిని బాల, ఎం.ఎల్.సి.లు శమంతకమణి, పయ్యావుల కేశవ్ జిల్లాకలెక్టర్, అధికారులు హాజరయ్యారు.
సభాస్థలి చేరుకున్న ముఖ్యమంత్రి
రైతులకోసం వ్యాసాయశాఖ వారు వ్యవసాయ యంత్రాలను, ప్రభుత్వ సబ్సిడీ వివరాలు డిస్ప్లే చేసి రైతులకు తెలిపారు.













