జాతీయ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అన్నాడీఎంకే నేత వేణుగోపాల్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలె, తారిక్ అన్వర్, టీఎంసీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఒబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టీఆర్ఎస్ నేత జితేందర్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. విభచన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన చట్టంలో అంశాలు, ప్రత్యేకహోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని వారికి విజ్ఞప్తి చేశారు.













