Chandrababu :వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తి : సీఎం చంద్రబాబు
వజ్రం అయినా సానబెడితేనే దాని విలువ తెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఐఐటీ, నిట్, నీట్లో ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు (SC/ST students) సీఎం చంద్రబాబును కలిశారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా చంద్రబాబు రూ.లక్ష చెక్కుతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని అన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. BR Ambedkar ) ఐఐటీ-నీట్ (IIT, NIT) సెంటర్లలో కోచింగ్ పొంది ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్లో 55 మంది ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు సీట్లు సాధించారు. సచివాలయం (Secretariat ) లో నన్ను కలిసిన సందర్భంగా వారు తమ సంతోషాన్ని నాతో పంచుకుంటే ఎంతో సంతృప్తి కలిగింది. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు పొందిన వారికి ఒక్కక్కరికి రూ.లక్ష ప్రోత్సాహకం, జ్ఞాపిక అందించి అభినందించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపయోగపడేలా కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సరైన సదుపాయాలు శిక్షణ, సాయం అందిస్తే ప్రపంచంలోని అందరితో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉంది. వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తి నివ్వాలని ఆశిస్తున్నాను అని సీఎం పేర్కొన్నారు.













