దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
స్త్రీ శక్తి ఏమిటో లోకానికి చాటిన రోజులే నవరాత్రులని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి(దసరా) పండుగని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గాష్టమి, మహర్నవమి శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో ఆదిపరాశక్తిగా నిలిచిన కనకదుర్గమ్మ మనకు సదా స్ఫూర్తినిస్తుందన్నారు. దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. తెలుగు వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.













