ఆరు రోజులు అసెంబ్లీలో చర్చలు ఫలప్రదం : సీఎం చంద్రబాబు
అసెంబ్లీలో పాలసి డాక్యుమెంట్ ఇచ్చాం. బడ్జెట్ లో ఈ ఏడాది ఏం చేస్తామో చెప్పాం. నిన్న విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. గ్రామం, వార్డు నుంచి రాష్ట్ర స్థాయి విజన్ ఏపిలోనే.
ఉద్యోగులకు తొలి ఏడాదే 43% ఫిట్ మెంట్ ఇచ్చాం, ఐదో ఏడాదిలో 20% ఐఆర్ ఇచ్చాం. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమం. వీఆర్ వో, వీఆర్ ఏ, ఆశా, అంగన్ వాడిల జీతాలు పెంచాం.
హోంగార్డుల వేతనాల పెంపు, పోలీస్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు. రైతుల ఆదాయం రెట్టింపు చేశాం. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేశాం. యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాం. మహిళలకు ఆర్ధిక సాయం అందించాం. ఏ వర్గంలోనూ అశాంతి లేదు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
ఇలాంటి ప్రతిపక్షం అవసరం లేదు: టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
ఇది అభివృద్దికి అడ్డుపడే ప్రతిపక్షం. నేరాలకు పాల్పడే ప్రతిపక్షం. అరాచకాలను ప్రోత్సహించే ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డికి ఏమీ చేతకాదు. అతనికి సభ్యత లేదు, సంస్కారం లేదు. మోదితో లాలూచి పడి రాష్ట్రానికి ద్రోహం. బిజెపి, వైసిపి లాలూచిని ప్రజల్లో ఎండగట్టాలి.













