వరాల సంక్రాంతి – తెలుగు వారికి పండగ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
సంక్షేమ ఫలాల మూట విప్పుతున్న ప్రభుత్వం – ఈ నెల నుంచే 2వేల పింఛను – సాగుకు 9 గంటల విద్యుత్తు- రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు-రజకులకు పింఛన్ల ప్రతిపాదన- 70 ఏళ్లు దాటిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పెంపు 15శాతం- 2 చేతులు లేని వారికి రూ.10వేల ‘వరం’ – రాష్ట్రాభివృద్ధి కొనసాగించడానికి మద్దతివ్వాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆంధప్రదేశ్ లో ఆనందోత్సాహాలతో భోగి వేడుకలు
సంక్రాంతి పండగ సందర్భంగా సందడిగా మారిన తెలుగు లోగిళ్లు – పల్లెల్లో ఉట్టిపడుతున్న తెలుగు సంస్కృతి సంప్రదాయాలు – ఇళ్ల ముందు కనువిందు చేస్తున్న రంగవల్లులు – భోగి మంటలు వేసి ఆనందోత్సాహలతో వేడుకలు జరుపుకొంటున్న ప్రజలు – విజయవాడలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు – గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్సులోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి మంటలు – సంక్రాంతి పండుగ విశిష్టతను చాటుతూ సంప్రదాయాలను గుర్తు చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ – ఆకట్టుకున్న హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు – ప్రకాశం జిల్లా ఒంగోలులో సంతరించుకున్న సంక్రాంతి శోభ .













