ప్రభుత్వాసుత్రులు దేశంలోనే బెస్ట్‌గా ఉండాలి : సీఎం చంద్రబాబు ఆదేశం
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. వైద్యారోగ్యశాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయండి. టెలీ మెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించండి.గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించింది. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించండి. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి. రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందించాలి. రాష్ట్రంలోఎక్కడ డోలీ మోతలు కనిపించొద్దు. ఫీడర్ అంబులెన్స్‌ల ద్వారా రోగులను తరలించాలి. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని సూచించారు.













