ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు, పవన్
అమరావతికి రైల్వేలైన్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్త రైల్వేలైన్ ఏర్పాటుతో అమరావతి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుందన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశం దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూసేకరణ సహా ఇతర అంశాల్లో రాష్ట్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.













