మనం సైలెంట్ గా ఉంటే ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నేతలకు పలు సూచనలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై మనం సైలెంట్‌గా ఉంటే ప్రమాదమని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేంద్రం తీరుపై పోరాటం కొనసాగిద్దామని నేతలకు సూచించారు. అలా అని అతిగా కూడా స్పందించవద్దని, జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఎంపీలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని అన్నారు. మిత్రధర్మాన్ని బ్యాలెన్స్ చేసుకొని పోరాటం చేద్దామని సూచించారు.













