సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్యాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్యాష్ చేయాలని పిటిషన్లో చంద్రబాబు కోరారు. సోమవారం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి, వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది. దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్యాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.













