సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. జగన్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. పాదయాత్ర కోసం కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. మినహాయింపు ఇస్తే విచారణ ఆలస్యమవుతుందని సీబీఐ, ఈడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరై మిగిలిన రోజుల్లో పాదయాత్ర చేసుకోవచ్చు కదా అంటూ విచారణ సందర్భంగా జగన్ తరుపు న్యాయవాదిని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానాల మీద ఉన్న గౌరవంతోనే కోర్టు విచారణకు హాజరవుతున్నాన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవచ్చుకదా అని కోర్టు సూచించింది.
పాదయాత్ర చేసుకునేందుకు వీలుగా ఆరు నెలలు వ్యక్తి గత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేస్తున్న పిటీష్ విచారణార్హం కాదని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదించింది. దీంతో అప్పీల్‌కు వెళ్ళే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడంతో వైసీపీ నేతలు డైలమాలో డ్డారు. పాదయాత్ర షెడ్యూల్‌ను కసరత్తు చేస్తున్నారు.













