డేరా బాబా తరహాలో కొడాలి నాని కూడా : బుద్దా వెంకన్న
డేరా బాబు తరహాలో మంత్రి కొడాలి నాని కూడా జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని ఓ పిచ్చి కుక్క అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాయాన్ని కూడా తప్పు పట్టడానికి నానికి సిగ్గుండాలన్నారు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే మంత్రి వ్యాఖ్యలు చేశారు. పిచ్చి కుక్కను అందలం ఎక్కించి నాడు చంద్రబాబు తప్పు చేశారని అన్నారు. చంద్రబాబు దగ్గర కొడాలి నాని బీఫాం తీసుకుని గెలవలేదా? అని ప్రశ్నించారు. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా కొడాలి నానికి లేదన్నారు. 10 రోజుల్లో కొడాలి నాని అవినీతి చరిత్ర బయటపెడతామని అన్నారు. చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చే మనిషి కాదు, పవన్ తీసుకునే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.













