నేను ఆధారపడలేను అంటున్న బాబు…?
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ముందు నుంచి కూడా రాజకీయం చేసే విషయంలో కొంత మందికి భయపడుతూ రాజకీయం చేసే పరిస్థితి ఉంటుంది. పార్టీలో ఉన్న చాలా సమస్యలను అందుకే చంద్రబాబు నాయుడు పరిష్కరించలేక పోతున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతూ ఉంటుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నేడు ఈ పరిస్థితి ఉండటానికి చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని తప్పులే ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు అంటాయి. ప్రధానంగా అగ్ర నేతలకు ముందు నుంచి కూడా భయపడుతూ రాజకీయం చేయడంతో అగ్ర నేతలు కొంతమంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతూ ఉంటాయి.
ప్రధానంగా కొంతమంది కీలక నేతలతో చంద్రబాబునాయుడు మాట్లాడే సమయంలో వాళ్ల అభిప్రాయాలనే నిర్ణయాలుగా కొనసాగిస్తూ ఉంటారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలూ, ఉన్న పరిస్థితులు చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లడం లేదు అనే భావన కొంతమందిలో ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు దృష్టికి అగ్రనేతలు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అని ఆరోపణలు వినిపించాయి. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా కనబడిన 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా దారుణంగా ఓడిపోయింది.
2019 తర్వాత పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనికి ప్రధాన కారణం అగ్రనేతలు. ఇక నియోజకవర్గాల్లో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు మాట్లాడనీయకుండా చేసిన కొంతమంది నేతలు ఇప్పుడు పార్టీ పరిస్థితి ఇలా ఉండడానికి కారణం అయ్యారు అనే ఆవేదన కార్యకర్తలలో కూడా ఎక్కువగా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అగ్రనేతలు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పార్టీలో ఉన్న అగ్రనేతల పదవులను తప్పించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. దీని కారణంగా పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం నియోజకవర్గంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకత్వం కనబడ లేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. యనమల రామకృష్ణుడు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు నియోజకవర్గాల్లో పార్టీ దారుణంగా ఉంది.
వర్ల రామయ్య నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. అందుకే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు దిశగా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. సీనియర్ నేతల సేవలను వాడుకుంటూనే… కార్యకర్తలు అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా అక్కడ స్థానిక నేతలతో కూడా నేరుగా మాట్లాడే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీలో ఉన్న కొంతమంది స్థానిక నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా నియోజకవర్గానికి ఎవరైతే బాగుంటుంది అనే అభిప్రాయం నేరుగా కార్యకర్తలను, వాళ్ళను అడిగి తెలుసుకునే అవకాశం ఉండవచ్చు. వైసీపీ నాయకులతో వ్యాపారాలు చేస్తున్నారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వాళ్ల ను పార్టీ నుంచి పంపడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.













