Peddi Reddy Ramachandra Reddy: ఇటు కొడుకు.. అటు తండ్రి..కేసుల వలయంలో పెద్ది రెడ్డి కుటుంబం..

వైసీపీ (YCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddi Reddy Ramachandra Reddy) కుటుంబం ప్రస్తుతం రాజకీయంగా మరియు న్యాయపరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. చిత్తూరు జిల్లాతో (Chittoor District) పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కుటుంబం పరిస్థితి గురించి హాట్ టాపిక్‌గా మారింది. పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ప్రస్తుతం మద్యం కేసులో ఎదుర్కొంటున్న ఆరోపణలు ఆయన భవిష్యత్తును ప్రశ్నార్థకం మారుస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి ఆయనను విచారించగా, ఎప్పుడు మరల విచారణ జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు (Supreme court) నుంచి వచ్చే ఆదేశాలపై మిథున్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడుతుంది. ఇదే సమయంలో మదనపల్లె ఫైళ్ల దగ్ధం (Madanapalle) కేసులో కూడా పెద్దిరెడ్డి కుటుంబంలోని (Peddi Reddy family) ఇద్దరిపై కేసులు నమోదవ్వడం మరింత చర్చకు దారి తీసింది. ప్రభుత్వం కూడా ఈ కేసులపై స్పష్టత కోసం దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా పెద్దిరెడ్డిపై అటవీ భూముల ఆక్రమణల కేసులు కూడా నమోదవుతుండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ కేసులను స్వయంగా డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యవేక్షిస్తుండడం రాజకీయ ప్రాధాన్యతను సూచిస్తోంది.
ఇలా ఒకవైపు ఎంపీ మిథున్ రెడ్డిపై, మరోవైపు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై విచారణలు జరుగుతుండటంతో ఈ కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉంది. రాజకీయంగానూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వైసీపీ సమావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు ఈ కుటుంబం గైర్హాజరవుతోందని సమాచారం. కేసుల కారణంగా పూర్తిగా బిజీ అయిపోవడం, బయట రాజకీయ చర్యలకు దూరంగా ఉండటం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా సంపర్కం తగ్గిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో రాజంపేట (Rajampet) , పుంగనూరు (Punganur) ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో అనూహ్యంగా వెనుకడుగు వేస్తోందన్న మాట వినిపిస్తోంది. కూటమి నాయకులు కూడా ఇదే ఆశించారని, పెద్దిరెడ్డి రాజకీయాలకు ఎదురుదెబ్బ ఇవ్వాలన్నది వారి వ్యూహమని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న కేసులు ఆ వ్యూహానికి అనుకూలంగా పరిణమిస్తుండటంతో, పెద్దిరెడ్డి కుటుంబం నిశ్శబ్దంగా మారిపోయింది. వీరిపై కేసులు పెరుగుతూ పోతే, వారి రాజకీయ ప్రస్థానానికి గండికొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.