ఎపిఎన్ఆర్టీ అభివృద్ధి పాలసీకి ఆమోదం
విదేశాల్లో ఉన్న భారతీయులు, తెలుగువారి కోసం రూ.40 కోట్టు కేటాయిస్తూ ఏపీఎన్ఆర్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు పాలక మండలి తొలి సమావేశం జరిగింది. సీఎం చైర్మన్‌గా ఉన్న పాలకమండలి సమావేశంలో మైగ్రేషన్ పాలసీకి ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర భరోసా ఏర్పాటు చేశారు. త్వరలో ప్రవాసాంధ్ర సహాయనిధిని ఏర్పాటు చేయనున్నారు.
ఏపీ ఆన్‌ఆర్‌టీ సభ్యులుగా చేరే వారందరికీ ప్రవాసాంధ్ర భరోసా కింద భీమా వర్తించనుంది. ఉపాది కోల్పోయే వారిని తక్షణం ఆదుకునేలా ప్రవాసాంధ్ర సహాయనిధి పనిచేయనుంది. మైగ్రేషన్ పాలసీ అమలులకు ప్రభుత్వం తరపునీ ఏడాది రూ.400 కోట్లు కేటాయించారు. తక్షణమే రూ.20 కోట్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఇండస్ట్రియల్ పాలసీ ఏర్పాటు చేశారు. హరియణా తరహాలో ఏపీ ఎన్టీఆర్టీల కోసం స్పెషల్ ఇన్వెస్టిమెంట్ జోన్‌పై అధ్యయనం చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీలకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు.













