11న అమెరికా నుంచి హైదరాబాద్ కు విమానం
ఇతర దేశాల నుంచి ఆంధప్రదేశ్‌కు వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు విజ్ఞప్తి చేశారు. వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వస్తాయని చెప్పారు. ఆయా విమానాల్లో మన వారిని సిద్ధంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధప్రదేశ్‌కు చేరుకున్నవారికి రెండు రకాల క్వారంటైన్లు సూచిస్తున్నామనీ, పెయిడ్, ఉచిత క్వారంటైన్లలో ఏదైనా ఎంచుకోవచ్చన్నారు. ఇప్పటివరకు 30 వేల మంది ఏపీ వాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు చేసి క్వారంటైన్ లేదా కొవిడ్ ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
2 వారాల క్వారంటైన్ తర్వాత మళ్లీ 14 రోజులకు హోం క్వారంటైన్ పాటించాలి. ఢిల్లీలో నోడల్ అధికారిగా హరీశ్‌కుమార్, ఏపీలో బాబూరావు నాయుడు ఉంటారు. అమెరికా నుంచి మొదటి విమానం ఎల్లుండి హైదరాబాద్ వస్తుంది. వారిని విజయవాడలోనే క్వారటైన్ చేస్తా. హోటల్ క్వారంటైన్ చేసేందుకు తక్కువ ఖర్చుతో ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు 11 రైళ్లు ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. వాటిలో 11868 మందిని తరలించాం. మరో 14 రైళ్లకు సంబంధించిన ప్రణాళిక పంపాం. ఇప్పటికే ఏపీకి రెండు రైళ్లు చేరుకున్నాయి. రైళ్లు వెళ్లేందుకు రాజస్థాన్, బెంగాల్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఒక్క రైలు పంపేందుకే ఝార్ఖండ్ అనుమతిచ్చింది. అందుకే ఇతర రాష్ట్రాలకు కూలీలను త్వరగా పంపలేకపోతున్నాం. వీరి తరలింపునకు ఖర్చంతా ఏపీ ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కో వలసకూలీకి రూ.500 చొప్పున ఇస్తున్నాం అని కృష్ణబాబు తెలిపారు.













