ఉద్యోగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలం : మంత్రి డీఎస్బీవీ స్వామి
విజయవాడలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల (Secretariat Employees) ఆందోళనపై మంత్రి డీఎస్బీవీ స్వామి (DSBV Swami) స్పందించారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందన్నారు. సచివాలయ సిబ్బంది రెగ్యులరైజేషన్, సౌకర్యాల విషయంలో రాజీ పడట్లేదని తెలిపారు. పాత బకాయిలు, ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు. గతంలో ఇవ్వాల్సిన రెగ్యులరైజేషన్ (Regularization)ను తమ ప్రభుత్వమే అమలు చేసిందని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ (Notional Increments)ను ఆర్థిక శాఖకు పంపినట్లు చెప్పారు. కొందరు రాజకీయ లబ్ధికోసం ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అసాంఘిక శక్తులు చొరబడి దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.








