రణబాలి మేకింగ్‌కు స్పెషల్ ట్రీట్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా రణబాలి. 19వ శతాబ్దపు నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం చేసిన విస్తృత పరిశోధన, ప్రీ-ప్రొడక్షన్ వర్క్, విజువల్ డిజైన్, యాక్షన్ ఎపిసోడ్స్ వెనుక ఉన్న శ్రమను ఆడియన్స్ కు పరిచయం చేసేందుకు మేకర్స్ ప్రత్యేకంగా నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను అనౌన్స్ చేశారు. రణబాలి: నెవర్ ఫర్గెట్ ది ట్రూత్ పేరుతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
తెలుగు సినిమాకు సంబంధించి మేకింగ్‌ను ఇలా డాక్యుమెంటరీ సిరీస్ రూపంలో చూపించడం ఇదే మొదటిసారి అని చిత్రబృందం చెబుతోంది. ఇందులో 19వ శతాబ్దపు ప్రపంచాన్ని రీక్రియేట్ చేసేందుకు ఉపయోగించిన చారిత్రక ఆధారాలు, కాస్ట్యూమ్స్, యాక్షన్, సెట్స్, విజువల్ డిజైన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషిని చూపించనున్నారు. దీంతో సినిమా రూపకల్పన వెనుక జరిగిన అసలు ప్రయాణంపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది.
ది ఫ్యామిన్ వి ఫర్గాట్ పేరుతో తొలి భాగం సెప్టెంబర్ 28న, ది హిస్టరీ వి ఫర్గాట్ సెప్టెంబర్ 30న, ది మెన్ వి ఫర్గాట్ అక్టోబర్ 2న రిలీజ్ కానున్నాయి. ఆఖరి భాగం ది లాస్ట్ లోడ్ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ని టీ-సిరీస్ సమర్పిస్తోంది. అక్టోబర్ 16న రణబాలి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.








