రైతులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. రూ.3,900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన వివరించారు. 30 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.39 వేల చొప్పున జమ చేసినట్లు చెప్పారు. రైతు తన రుణ అర్హత, గుర్తింపు పత్రాలు బ్యాంకులో సమర్పించాలని ఆయన సూచించారు. రుణ అర్హత పత్రాన్ని బ్యాంకులో నమోదు చేస్తే వడ్డీతో సహా ఇస్తారన్నారు. అన్నదాతా సుఖీభవ నిధులు కూడా ఖరీఫ్లోగా ఇస్తామన్నారు. మే 23లోపు ఐదో విడత రుణమాపీ నిధులు విడుదల చేస్తామని సృష్టం చేశారు. రుణమాఫీపై రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబరావు అన్నారు. మరోవైపు పసుపు-కుంకుమ 3వ చెక్కు సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని.. రెండు విడతల్లో రూ.20 వేలు డ్వాక్రా సభ్యులకు ఇచ్చామన్నారు.













