ఏపీలో మూడు జిల్లాలో మళ్లీ లాక్డౌన్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఒకేరోజు 465 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,961కి చేరుకున్నాయి. కట్టడి ప్రాంతాలు 741కి చేరుకున్నాయి. కేసుల విస్త•తితో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్డౌన్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో 17,609 నమూనాలు పరీక్షించారు. వీటితో రాష్ట్రంలో స్థానికంగా 376 కేసులు బయటపడ్డాయి. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 19, 70 చొప్పున కేసులను గుర్తించారు. కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి వంతున ప్రాణాలు విడిచారు. వీరితో మృతుల సంఖ్య 96కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.













