నీలి బెండేపూడికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు
అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అధ్యక్షురాలిగా ప్రవాసాంధ్రురాలు, విశాఖకు చెందిన నీల బెండేపూడి నియమితులయ్యారు. విశాఖలో పుట్టిపెరిగిన ఆమె ఉన్నత విద్యాభ్యాసం కోసం 1986లో అమెరికా వెళ్లారు. ప్రస్తుతం కెంటకీలోని లూయిస్విల్లీ వర్శిటీలో మార్కెటింగ్ విభాగం ప్రొఫెసర్గా, అధ్యక్షురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా పెన్ వర్సిటీ తదుపరి అధ్యక్షురాలిగా నీలి బెండేపూడిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పెస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ కీలకమైన పదవికి ఎంపికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. రాష్ట్రానికి చెందిన నీలి బెండేపూడికి అద్భుతమైన అవకాశం దక్కడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని అయిన నీలి పెన్సిల్వేనియా వర్శిటీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ అని కొనియాడారు.






