పోలవరం ఏపీకి జీవనాడి
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని, దాన్ని పూర్తి చేయడమే తన జీవితాశయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేయాలన్న ఉద్దేశంతోనే సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. తాను ఇప్పటివరకు 20 సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, స్పిల్‌వే పనులు 72శాతం, డయా ఫ్రం వాల్ పనులు 47.99శాతం, మట్టి పనులు 72శాతం పూర్తయ్యాయి. రేడియల్ గేట్లు వంద శాతం పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.12,567.22 కోట్ల పనులు పూర్తి చేస్తే, కేంద్రం నుంచి రూ.4,329 కోట్లు వచ్చాయి. రూ.58.391.06 కోట్లకు సవరించిన అంచనాలు కేంద్రానికి పంపించాం అని చంద్రబాబు ప్రకటించారు.













