ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక అంశాలకు క్యాబినెట్ (Cabinet) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. రాజమహేంద్రవరం (Rajamahendravaram), గుంటూరు(Guntur), తిరుపతి( Tirupati), కర్నూలు ( Kurnool) కేంద్రాలుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో రూ.1,548 కోట్లతో మౌలిక వసతుల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి ఇన్ఫ్రా పనులకు అదనంగా రూ.644.98 కోట్లు, అసెంబ్లీ భవన స్పైర్, రూఫ్, లిఫ్ట్ పనులకు రూ.661 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఎల్పీఎస్ రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనల సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.








