విశాఖలో ఏపీ అగ్రిటెక్ సదస్సు ప్రారంభం
విశాఖలో ఏపీ అగ్రిటెక్ సదస్సు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడతో పాటు పలువురు మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ వ్వవసాయ విధానాలపై ప్రదర్శనలు, అన్నదాతల సమస్యలకు పరిష్కారం చూపేలా సదస్సును నిర్వహిస్తున్నారు. కాగా కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ రేపు సదస్సుకు విచ్చేయనున్నారు. అలాగే 17వ తేదీన ముగింపు రోజున బిల్‌గేట్స్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బిల్ అండ్ మిలిందాగేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.













