సీఎం జగన్‌కు కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వానం
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ఈ నెల 22 నుంచి సెప్టెంబరు 11 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు, ఆలయ ఈవో ఎ.వెంకటేశులు విజయవాడలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆహ్వానపత్రంతో పాటు స్వామివారి శేషవ్రస్తాలు, తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ వేదపండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం అందించారు.













