మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు బాద్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా అవకాశం ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నాన్నానన్నారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన జలయజ్ఞన్ని పూర్తి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకి నీరందించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటానన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.













