అమరావతిలో ఐకానిక్ టవర్స్
అమరావతి రాజధానిలో ప్రపంచంలోని 10 అగ్రశేణి కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటికి ధీటుగా ఐకానిక్స్ టవర్స్ నిర్మాణ పనులు చేపట్టాలని షాపూర్ జీ-పల్లోంజీ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎపిసిఆర్డిఎ) అధికారులు ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ-పల్లోంజీ ప్రతినిధులతో సీఎం ట్విన్ టవర్స్ నిర్మాణంపై చర్చించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటి కట్టడాలు ఉన్నాయని, మలేషియా, సింగపూర్ దేశాల్లో ఈ తరహా నిర్మాణాలు చేపట్టారని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటన్నింటినీ లేని ఆకర్షణలు అమరావతిలో ఉన్నాయని వారికి సృష్టం చేశారు. పుష్కలంగా కనిపించే జల సంపద, మైమరపించే పచ్చదనంతో పాటు క్రీయాశీలకంగా ఉండే పౌరులు కొత్త రాజధాని అమరావతికి ప్రధాన వనరులని చెప్పారు. వీటన్నింటి కారణంగా ఇక్కడ ఏర్పాటు చేసే జంట టవర్ల పర్యాటకాని, వాణిజ్య రంగాన్ని బాగా ఆకర్షించగలవన్నారు.
ఈ ట్వీటన్ టవర్స్ కట్టడాల నిర్మాణం అమరావతి ఖ్యాతిని ద్విగుణీకృతం చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తాము రూపొందించిన అమరావతి ఐకానిక్ ట్విన్ టవర్స్ ఆకృతులు, నిర్మాణ వ్యూహంపై షాపూర్జీ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ జంట కట్టడాలలో కార్యాలయ స్థలం 55 నుండి 57 శాతం వరకూ ఉంటుంది. వాణిజ్య అవసరాల కోసం 12నుండి 13 శాతం వరకు కేటాయిస్తారు. సర్వీస్ అపార్టుమెంట్స్ కోసం 8 శాతం ప్రదేశాన్ని వినియోగించనున్నారు. ఈ టవర్లను వేటి కోసం, ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. వాణిజ్య, కార్యాలయ, అవసరాల కోసమే కాకుండా ప్రజలు నివసించేందుకు వీలుగా అందుబాటు ధరలో అపార్టుమెంట్లుగా వీటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. దీనిపై మరిత అధ్యయనం చేసి 3 వారాల్లోగా సమగ్ర ఆకృతులు, నివేదికతతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ సంస్థకు సూచించారు.













