15 నుంచి విశాఖలో అగ్రి హాకథాన్
విశాఖలో నవంబర్ 15,16,17 తేదీల్లో అగ్రి హాకథాన్ నిర్వహించనున్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ హాజరుకానున్నారు. బిల్గేట్స్ గంట నుంచి రెండు గంటలపాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే నెల 15న సదస్సు ప్రారంభం కానుండగా 16న ముగింపు కార్యక్రమానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరపున బిల్గేట్స్ రానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేదా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. నగరంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించిన ఏపీఐఐసీ స్థలంలోనే దీన్ని నిర్వహించనున్నారు.













