పవన్ కు అంత పవర్ ఉంటే ప్రచారానికి సెలబ్రిటీలు అవసరమా..?.. నటి శ్యామల..
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అతనికి మద్దతుగా సినీ తారలు పిఠాపురానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పై నటి శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ కి అంత ఇమేజ్ ఉన్నట్లయితే.. మిగిలిన సినిమా వాళ్లతో ప్రచారం చేయించడం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయం అయిందని.. అందుకే భయంతో మిగిలిన సెలబ్రిటీలను మద్దతుగా పిలుచుకుంటున్నారని ఆమె అన్నారు. శుక్రవారం విలేఖర్లతో మాట్లాడిన నటి శ్యామల.. పిఠాపురంలో వంగా గీత చాలా సీనియర్ నాయకురాలని.. ఆమె భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రజలకు అభివృద్ధి కావాలి అంటే కచ్చితంగా వంగా గీతను ఎంచుకుంటారని.. ఆమె స్పష్టం చేశారు.













