ఐటీ ఉద్యోగులకు శుభవార్త
ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త. రాబోయే ఆరు నెలల్లో ఐటీ రంగంలో పలు మేటి సంస్థలు పెద్దఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పలు ఐటీ కంపెనీలు ప్రధానంగా జూనియర్ లెవెల్ ఉద్యోగాలను భారీగా రిక్రూట్ చేసుకోనున్నాయని ఎక్సెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణల నేపథ్యంలో భారత్‌లో గత కొద్దినెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్ ప్రణాళికలకు పదును పెడుతుండగా, నాస్ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకాలపై దృష్టి సారించాయని సర్వే తేల్చింది.













